వలస బ్రతుకులు – బ్రతుకే వలస పోతోంది

17th November 2015 at 1:53 pm
valasabrathukulu

పొట్ట కూటి కోసం బండి కట్టి,

పట్టు బట్టలు పెట్టలోన పెట్టి ,

గంట చుట్ట నోట పెట్టి,

నూలు బట్ట కట్టె పల్లె బటువు.

పన్నీటి మనసు తోని కన్నీటి కన్ను తోని ,

అలసిపోయిన మేని తోని,

వానలేని ఊరినొదిలి,

పనినిచ్చే పురి కోసం వెళ్లెనతను .

చేత డబ్బు లేదు, నింగిన మబ్బు లేదు, పిల్లవాని జబ్బు ముదిరె.

పని కోసం అడిగి అడిగి అలసి సలసి సొమ్ము లేక సొమ్మసిల్లె.

కాదన్నొచ్చే కరువు,

తరిమికొట్టిన తరువు,

అడిగినా రాని  అరువు పరువే అయ్యే బరువు.

దయ తలచని దేవుడు , వరమివ్వని వరుణుడు, నేనేదిక్కన్న యముడు..

ఏమి సేసితిని పాపమని, నైవేద్యమిచ్చె ఊపిరిని.. 

avatar
1000