రైతన్నా – నీకే అంకితం

23rd November 2015 at 4:02 am

ఆంధ్రాలో  ఐనా అమెరికాలోనైనా  ఆకలి తీర్చే అన్నదాతదే అగ్రస్థానం… అట్టి అవతారునికే ఆకలి అలమటా ??

రైతే రాజు, రైతుదే రాజ్యం అన్నది రాజకీయం… అట్టి రారాజుకే రొట్టె దొరకని వైనమా??

పంటనే పత్నిగా, పనినే ప్రాణంగా భావించే పుణ్యాత్ముడు… అట్టి పౌరునికి పురుగులమందు పాయసమా??

తాను పస్తులుండి మనకు ఫలహారన్నిచ్చే పరోపకారుడు… అట్టి పురుషోత్తముడికి పాడె పరుపు పడకా??

భాదలన్ని భరించి భూమి బ్రతుకు బువ్వనిచ్చు భూభటువు … అట్టి ఉత్తముడికి ఉరికొయ్యే  ఉయ్యాలా??

అయ్యో

                      కంటి ముందు కరువు కరగదాయె, కంటి నీరు పంట సరి తూగదాయె..

                      కారు లేని నాడు కాళ్లు దిక్కు, కర్షకుడు లేని నాడు ఎవడు దిక్కు??

avatar
1000