మేలుకో ఇకనైనా

 

తగలబెట్టుకో… తగలబెట్టుకో…

నీ ఆస్తిని నువ్వే తగలబెట్టుకో..

కూల్చుకో… కూల్చుకో…

నీ సమాజాన్ని నువ్వే కూల్చుకో..

మంటగల్పుకో… మంటగల్పుకో…

నీ ఆత్మ గౌరవాన్ని నువ్వే మంటగల్పుకో..

లేవనెత్తుకో … లేవనెత్తుకో …

పనికి రాని ఉద్యమాలని లేవనెత్తుకో ..

ఎందుకు… ఎందుకు…

జరగబోదు దాని గూర్చి చింత ఎందుకు..

నీకు తెలుసు… నాకు తెలుసు…

జరిగింది  ఏంటో.. జరిగేది  ఏంటో..

అయినా గాని మనం మారము..

ముందు తరాన్ని అయినా  మార్చము..

ఇంకెందుకు… ఇంకెందుకు…

ఈ గర్జనలు , ఈ ఉద్యమాలు..

గర్వించుకో… గర్వించుకో…

నీవు భారతీయుడవని గర్వించుకో..

పాటుపడు… పాటుపడు…

కుల వ్యవస్థ నిర్మూలనకి పాటుపడు..

కట్టడి చేయు.. కట్టడి చేయు..

ఈ అరాచకాలని కట్టడి చేయు..

అడ్డుకో… అడ్డుకో…

ఈ కుట్రపు రాజకీయాలని అడ్డుకో..

తెంచుకో… తెంచుకో…

నీలోని ఆవేశాన్ని తెంచుకో..

నడిపించు… నడిపించు…

ఈ నవ భారతాన్ని ముందుకి నడిపించు..

కాని ఒక్కసారి ఆలోచించు..

నువ్వు చేసేది ఏదీ కూడా నీ కోసం కాదని..

గుర్తు పెట్టుకో… గుర్తు పెట్టుకో…

నీవే రేపటి పౌరుడివని!

289 COMMENTS

  1. “నువ్వు చేసేది ఏదీ కూడా నీ కోసం కాదని గుర్తు పెట్టుకో ” absolutely true.
    People are spoiling their own society

Comments are closed.