మరువను మరువలేను

12th November 2015 at 2:34 pm

మరువను మరువలేను,

ఈ జన్మకు నేనిక మరువలేను,

నా మనసు తలపులు తట్టిన క్షణమది,

గమ్యంలేని ప్రయాణమది,

మిణుగురు పురుగుల వెలుతురులో,

కారుచీకటిని చీల్చుకుని వెళుతున్న ప్రయాణమది,

నిర్మానుష్యమైన ప్రదేశంలో విశాలవంతమైన ప్రపంచంలో సాగుతుందాపయనం,

గగనం నుండి నా నుదుటిపై ఆ వర్షపు బిందువు రాలిపడినక్షణాన,

తనచేయి నా భుజంపై వేసింది,

అది కలయో నిజమోనన్న భ్రమలోనున్న సమయమది,

ఉరుము ఉరిమి, మెరుపు మెరిసి, చిరుజల్లు కురిసింది,

ఒక్కసారిగ ఉలిక్కిపడ్డ ఆమె హఠాత్తుగా వెనుకనుండి నన్ను గట్టిగా హత్తుకుంది,

ఆ ఒక్క క్షణముకి నా జన్మజన్మలు ఋణపడియున్నవి,

ఆ ఒక్కక్షణం ప్రపంచమంతా నా గుప్పిటలో ఉందన్నభావన,

ఈ ప్రపంచాన్ని జయించిన ఆత్మవిశ్వాసం,

మరువను మరువలేను,

మరిచివుండలేను ఈ జన్మకి… నేనిక మరువలేను…

avatar
1000
1 Comment threads
0 Thread replies
0 Followers
 
Most reacted comment
Hottest comment thread
1 Comment authors
srikanth Recent comment authors
newest oldest most voted
srikanth
Guest
srikanth

Good one…