జీవితం – ఒక రీసెట్ లేని గేమ్

ఒక చిన్న పాప సెల్ఫోన్లో గేమ్ ఆడుతోంది. ఆడుతూ ఒక స్టేజిలో ఓడిపోతే తను కప్పు గెలవలెను అని పక్కనే కూర్చున్న వాళ్ళ నాన్నతో అన్నది. వాళ్ళ నాన్న కూడా ఆ పాపతో పాటు పాప ఆ గేమ్ విన్ అవ్వాలి అని చూస్తున్నాడు. ఇంతలో  పాప ఆ గేమ్ ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ఇంతలో వాళ్ళ  నాన్న అయ్యో  అనుకుంటుండగా పాప గేమ్ ని రీసెట్ చేసి మళ్లీ ఫ్రెష్ గా ఆడటం మొదలు పెట్టింది. అయ్యో ఏంటమ్మా అలా ఆపేసావ్ అని నాన్న అంటే…. పాప అయ్యో నాన్న మళ్లీ ఆడి నేగ్గేస్తాలే అని అన్నది.

          ఇంతలో తండ్రికి తమ బందువు ఎవరో చనిపోయారని ఫోన్ వచ్చింది. అప్పుడు అందరు వాళ్ళను ఓదార్చడానికి అక్కడికి వెళ్లారు. అక్కడ అందరు బాధగా వుండటం చూసి ఆ పాప వాళ్ళ నాన్నతో…. నాన్న అందరు చాలా బాధగా కనిపిస్తున్నారు ఎందుకు అని అడిగింది. అక్కడ పక్కనే ఉన్నతన తండ్రి ఫ్రెండ్ పాపతో ఇలా అన్నాడు.. దేవుడు అండ్ అంకుల్ జీవితం అనే గేమ్ ఆడారు… అందులో దేవుడు గెలిచాడు అందుకే అంకుల్ని తనతో తీస్కేల్లిపోయాడు అని చెప్పాడు.

          అప్పుడు పాప ఇలా అన్నది…. అయ్యో పాపం అంకుల్. జస్ట్ రీసెట్ బటన్ ప్రెస్ చేసి వుంటే మళ్లీ ఆడి గెలిచేవాడు కదా. అక్కడే నిల్చుకుని ఈ మాటలు అన్ని విన్న నాకు ఈ ఆర్టికల్ రాయాలి అన్న ఆలోచన వచ్చింది. అవును కదా ఆ పాప చెప్పినట్టు మనిషికి ఎన్నో luxuries ఇచ్చిన ఆ దేవుడు మనిషికి కాలాన్ని వెనక్కు తిప్పే ఛాన్స్ మాత్రం ఇవ్వలేదు ఎందుకు??

          ఇదే ప్రశ్నని నేను మా తాత ముందు పెట్టాను. తాత మనిషి ఎన్నో తప్పులు క్షణికావేశం వాళ్ళ చేస్తాడు కదా… మరి దేవుడు మనిషికి కాలాన్ని వెనక్కు తిప్పే శక్తిని ఇచ్చినట్టయితే తను చేసిన తప్పులను సరిదిద్దుకోవచ్చు కదా వెనక్కు వెళ్లి. ఈ రోజుల్లో చాలా మంది రోడ్ ప్రేమదాల్లో చనిపోతున్నారు. ఒక మనిషి  ఆ ప్రమాదం జరిగిన మనిషి అక్కడే చనిపోతే ఆ ప్రమాదం చేసిన  మనిషి రోజు తను చేసిన తప్పును తలుచుకుని చస్తున్నాడు. అదే కాలాన్ని వెనక్కు తిప్పే పద్ధతి వున్నట్టు అయితే ఇద్దరు సంతోషంగా ఉండొచ్చు కదా.

          అప్పుడు మా తాత నాతో ఇలా చెప్పారు… దేవుడు మనిషికి తన అవసరాన్ని మించి సమకూర్చాడు. నువ్వు చెప్పినట్టు మనిషి తప్పు చేసి వాటిని సరిదిద్దుకోలేక బాధపడచ్చు. కాని అందరు అలా వుండరు కదా బంగారం. దేవుడు అందుకే మనిషి కాలాన్ని వెనక్కు తిప్పే పద్ధతి బదులుగా మరిచిపోయే గుణం ఇచ్చాడు. ఎంతటి విషయాన్ని ఐన మనిషి కాలం తో పాటు మర్చిపోతాడు. కాలం మనిషిని మార్చేస్తుంది. అదే ఈ time machine వుంది అనుకో తప్పు చేస్తే ఏమి అవుతుందిలే అనేది అలవాటు అయిపోద్ది. అప్పుడు పెద్దలు అంటే గౌరవమ్, భయం అని పదాలకు అర్థం కూడా మర్చిపోతారు  ఈ మనుషులు. మనుషుల్లో మనం ఏదైనా చేస్తే మన పేరెంట్స్ అండ్ సొసైటీ ఏమనుకుంటుంది అనే భయం ఇలా రీసెట్ ఆప్షన్ వుంటే అసలు వుండదు.

అందరూ shortcuts వెతుకుంటారు. కష్టం అనే పదానికి value లేకుండా పోతుంది. నేను ఒకటే చెప్తాను ఇలా time machine ఉన్న నాడు ప్రపంచం నాశనం అయిపోతుంది.

ప్రతి మనిషి తను అన్ని phases దాటగలిగితే వారిని కంప్లీట్ పర్సన్ అని అంటారు. ఇప్పుడు జనరల్ గా మాట్లాడుకుందాం. ఒక మనిషి తన డిఫరెంట్ views చూద్దాం

1. చిన్నతనంలో ఏమనుకుంటాడు అంటే నేను త్వరగా పెద్దగ అయిపోతే బాగుందే అని అనుకుంటాడు ఎందుకు అంటే తన చిన్న చిన్న సంతోషాలకి తన పేరెంట్స్ అడ్డుపడుతుంటారు కాబట్టి.

2.  అదే అబ్బాయి పెద్ద అయిన తర్వాత సంపదిస్తున్నప్పుడు ఏమంటాడు…అరె చిన్నతనమే బాగుండేది ఇప్పుడు అన్ని responsibilities అని అనుకుంటాడు ఎందుకంటే చిన్నతనంలో అన్ని తన పేరెంట్స్ చేసేవాళ్ళు కదా….

3.  అదే అబ్బాయి ముసలితనంలో ఏమంటాడు అంటే….నేను యవ్వనంలోనే  బాగుండేది అనుకుంటాడు ఎందుకంటే తను ఏమనుకున్న చేయగల శక్తి తనకి వుండేది కాబట్టి, ఎ స్టేజిలో ఎలా అనుకున్న అవన్నీ జస్ట్ memories మాత్రమే.

ఎన్ని కష్టాలు వచ్చిన మనిషి ముందుకు పోవాల్సిందే.జీవితం అంటే ప్రతిక్షణం ఆనందించుకుంటూ సాగించాల్సిన జర్నీ. మద్యలో ప్రమాదాలు రావచ్చు, ఎగిరి బోల్తా కొట్టొచ్చు…. కాని ముందుకు పోవాలి… బండిని ముందుకు నేట్టాల్సిందే…. ఎంతవరకు అనేది మనకు తెలిదు… ఫ్యూయల్ ఎంత అనేది మనకు తెలిదు….. ఉన్నంత వరకు ముందుకు పోతుంది…. రీసెట్ చేసి ఫిల్ చేసే శక్తి మనకు లేదు….

చివరగా చెప్పేది ఒక్కటే…. మన శక్తికి మించిన వాటి గురించి ఆలోచించుకుంటూ బ్రతకడం కంటే ఉన్నవాటితో సంతోషించడం చాలా గొప్ప విషయం….

 చిరునవ్వుతో…  శ్రీనివాస్ కళ్యాణ్

Comments are closed.