అమ్మా – ఇది నీకు

1st March 2016 at 11:13 pm
amma

నీ ఆకలికి మొదటి అన్నం అమ్మ పాలు

నీ జలుబుకి మొదటి రుమాలు అమ్మ కొంగు

నీ జ్వరానికి మొదటి థర్మామీటర్ అమ్మ చేయి

నీ నిద్దురకి మొదటి పరుపు అమ్మ ఒడి

నీ చెవులకి మొదటి సంగీతం అమ్మ లాలి

నీ నడకకి మొదటి అడుగు అమ్మ పిలుపు

నీ గెలుపుకి మొదటి గుర్తింపు అమ్మ నవ్వు

నీ ఓటమికి మొదటి ఓదార్పు అమ్మ కౌగిలి

avatar
1000