ఆడ-జన్మ-అపురూపం

aada-janma

పుట్టింది పుట్టింది పుత్తడి బొమ్మలా…
నవ్వింది నవ్వింది తన జన్మే అపురూపమని…

కళ్ళే తెరచి చూసినే తను నడిచే దారి ఏదని…
చిన్ని చిన్ని అడుగులు వేసినే తన దారిలోనే…
మెల్ల మెల్ల గ రప్పించినే అనుబంధమైన వాళ్ళని…
ముద్దు ముద్దు పలుకలతో చిలిపి చేష్టలే చేస్తూ…
ఇంటికే అందం తీసుకోచెనే తను ఎదుగుతూనే…

పుట్టింది పుట్టింది పుత్తడి బొమ్మలా…
నవ్వింది నవ్వింది తన జన్మే అపురూపమని…

ఘల్లు ఘల్లు మని గజ్జెలతో సవ్వడి చేస్తూ, ఎదనే తట్టేనే…
చదువు సంద్యల కోసమని, ఆడపిల్ల నన్న సంగతే మరిచి..
విద్యనభ్యసించి తనకంటూ పేరు తెచుకొనెనె..
కట్టు బాటులకి కట్టుబడి,మూడు ముళ్ళ బందానికి తల వంచితినే…
కన్న తల్లి దండ్రులని విడిచి తనలోనే తానే బాధ పడితినే..

పుట్టింది పుట్టింది పుత్తడి బొమ్మలా…
నవ్వింది నవ్వింది తన జన్మే అపురూపమని…

కన్న బిడ్డ తో పుత్తడి బొమ్మ కాస్త తల్లి అయినే..
తనలాంటి కష్టాలు బిడ్డకు రాకూడదని పెంపకానికే వన్నె తీసుకోచెనే..
తన తల్లిపాలు అమృతమై, బిడ్డకే ఆయుస్సు పెంచెనే..
తల్లి ప్రేమ కి మించిన ప్రేమే లేదని చాటి చెప్పెనే…
ఈ పుత్తడి బొమ్మ తొలి దైవమై, ప్రపంచాన్నే జయించెనె…
ఈ పుత్తడి బొమ్మే లేని ఈ సృష్టే ఉండదని రుజువు చేసెనే…

పుట్టింది పుట్టింది పుత్తడి బొమ్మలా…
నవ్వింది నవ్వింది తన జన్మే అపురూపమని…

Comments are closed.